బుల్లెట్ బండి వధువు కు ఏకంగా అలాంటి..అవకాశం ఇచ్చిన నిర్మాత?

బుల్లెట్ బండి ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ పాట మార్మోగిపోతోంది. పెళ్లిళ్లు, ఫంక్షన్లు, ఇలా ఎక్కడ చూసినా ఇదే పాట వినిపిస్తోంది. అయితే గత కొద్ది రోజుల క్రితం ఒక పెళ్లి అయిన కొత్త జంట ఈ పాటకు డాన్స్ చేయడంతో ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పాటకు పెళ్లి కూతురు వేసిన డాన్స్ చూసి చాలామంది ఫిదా అయిపోయారు. అంతే కాకుండా ఈ వీడియో రాత్రికి రాత్రి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ బుల్లెట్ బండి పాటకు డాన్స్ వేసిన వధూవరులకు అద్భుతమైన అవకాశం దక్కింది.

ఈ డాన్స్ వీడియోకు మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రావడంతో పాటు, రాత్రికి రాత్రి సెలబెట్రీల గా మారారు. ఈ నేపథ్యంలోనే బుల్లెట్ బండి పాట నిర్మించిన సంస్థ ఆ తరువాత పాటలకు డాన్స్ చేసే అవకాశాన్ని నవవధువు కల్పించినట్లు తెలుస్తోంది. ఈ పాటను బ్లూ రాబిట్ ఎంటర్టైన్మెంట్ సంస్థ వారు రూపొందించారు. ఈ సంస్థ వారు ఆ వధువు కు ఇలాంటి అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. అందుకు ఆ వధూవరులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.