ప్ర‌భాస్‌పై మ‌న‌సు పారేసుకున్న దివి..రెండు మూడు రోజులైనా దానికి ఓకేన‌ట‌?!

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 4లో పాల్గొని రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది దివి. ఈ షో త‌ర్వాత దివికి వ‌రుస ఆఫ‌ర్లు వెల్లువెత్తున్నాయి. ఇటీవ‌ల‌ క్యాబ్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన దివి.. ప్ర‌స్తుతం సినిమాలు, వెబ్‌సిరీస్‌ల‌తో బిజీ బిజీగా గ‌డుపుతోంది.

Divi Vadthya Wiki, Age, Height, Boyfriend, Family, Biography & More –  WikiBio

ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న దివి రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రభాస్‌పై తనకు క్రష్‌ ఉందని చెప్పుకొచ్చిన దివి..అయితే ఇప్పటి వ‌ర‌కు ఆయ‌న్ను రియ‌ల్‌గా చూడలేద‌ని తెలిపింది. ఒకవేళ ఆయన్ను కలిస్తే ఓ నైస్ అండ్ డీసెంట్ డేట్ అడుగుతా. ఆ డేట్ రెండు మూడు రోజులైనా నాకు ఒకే అని దివి చెప్పుకొచ్చింది.

Rebel Star Prabhas to get married in 2020? Here is what his aunt Shyamala  Devi has to say | Telugu Movie News - Times of India

అలాగే పవన్‌ స్పీచ్‌లంటే తనకు ఎంతో ఇష్ట‌మ‌ని, ఆయన తనని ఎంతో ఇన్‌స్పైర్‌ చేస్తారని దివి తెలిపింది. ఇక త‌న కెరీర్‌ను సెట్ చేసింది మాత్రం చిరంజీవిగారే అని.. బిగ్ బాస్ త‌ర్వాత ఆయ‌న సినిమాలో ఛాన్స్ రావ‌డం వ‌ల్లే త‌న క్రేజ్ పెరిగింద‌ని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ.