బ్రహ్మానందం రోజు సంపాదన ఎంతో తెలుసా ..?

సినీ ఇండస్ట్రీలో గత కొన్ని దశాబ్దాలుగా, ఒక గొప్ప హాస్య నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్న హాస్య నటులలో బ్రహ్మానందం కూడా ఒకరు. ఈయన నవరసాలు పండించడంలో ఆయనకు ఆయనే సాటి. ముఖ్యంగా బ్రహ్మానందం కామెడీ వల్లే ఒక్కొక్కసారి సినిమాలు కూడా హిట్ అవుతున్నాయి. తన మోములో రకరకాల హావభావాలను పండిస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ఉంటారు. ముఖ్యంగా చిరంజీవి, మోహన్ బాబు, బాలకృష్ణ వంటి స్టార్ హీరోల సినిమాలలో హాస్యనటుడిగా నటించి, ఆ సినిమాకు కొంత వరకు హైలెట్ గా నిలిచాడు.

ఇక బ్రహ్మానందంతో పాటు సహా నటి కోవై సరళ జతకట్టి వీరిద్దరూ కలిసి పండించే కామెడీ ఎంత అద్భుతంగా పండుతుంది అంటే , ఇంతకుమించి ఏమి చెప్పలేరు అన్నంతగా.. అలా వీరిద్దరూ నటిస్తుంటారు. ఇక ప్రస్తుతం అందరి మనసులో తలెత్తుతున్న ప్రశ్న ఏమిటంటే, బ్రహ్మానందం ఒక్క సినిమాకు ఎంత తీసుకుంటారు అని, ఒక సినిమాకు ఎంత తీసుకుంటారు అనే విషయం పక్కన పెడితే ఆయన రోజుకు ఎంత తీసుకుంటారో తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే. బ్రహ్మానందం ఒక్క సారి సినిమా షూటింగ్ లోకి అడుగు పెడితే ఒక్క రోజుకి మూడు లక్షల రూపాయలను తీసుకుంటారట.

దీన్ని బట్టి చూస్తే అర్థం అవుతోంది ఆయన ఒక్క సినిమాకు ఎంత తీసుకుంటారు అని.. ఇక అంతే కాదు ఈయనకు యంగ్ హీరోల కంటే ఎక్కువగా పారితోషికం ఇస్తున్నట్లు సమాచారం.