అవకాశం కొట్టేసిన నాని.. సక్సెస్ అవుతాడా..?

కరోనా వచ్చిన తర్వాత చాలావరకు సినిమా థియేటర్లన్నీ మూతపడ్డాయి. అయితే ఇప్పుడు తాజాగా 50శాతం భర్తీ తో థియేటర్లను తెరుచుకోవచ్చని థియేటర్ నిర్వాహకులకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఇక ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం సినిమాలు చాలా వరకు థియేటర్లలో విడుదల కావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇకపోతే ఓటీటీ ప్లాట్ ఫాం వేదికగా ఎంతోమంది సినిమా నిర్మాతలు క్యాష్ చేసుకోవడం కోసం సినిమాలను డైరెక్ట్ గా ఓటీటీ లో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే ఇటీవల నాని నటించిన టక్ జగదీష్ సినిమాపై కూడా పలు వార్తలు సంచలనం రేపుతున్నాయి.

త్వరలోనే టక్ జగదీష్ సినిమాను అమెజాన్ ప్రైమ్ లో లో విడుదల చేయడానికి మూవీ టీమ్ సిద్ధంగా ఉంది అనే పుకార్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇక అంతే కాదు ఈ సినిమాకు సంబంధించిన చిత్ర నిర్మాతలు కూడా అమెజాన్ ప్రైమ్ నుండి లాభదాయకమైన ఆఫర్లను అందుకున్నారట.తక్కువ బడ్జెట్ తో ఎక్కువ డబ్బు వస్తుందన్న ఆలోచనతోనే సినిమా నిర్మాతలు ఓ టీ టీ లో విడుదల చేయాలని చూస్తున్నట్లు సమాచారం. కాకపోతే ఇప్పటి వరకు అధికారికంగా సినీ బృందం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

పరిస్థితులు బాగుండి, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుండి అనుమతులు వస్తే , ఆగస్టు 7వ తేదీన ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయాలని చిత్రం మూవీమేకర్స్ చూస్తున్నారు. అంతేకాదు థియేటర్ లకు ఎంత వరకు ప్రేక్షకులు సినిమాలు చూడడానికి వస్తారు.. అనే విషయాలను కూడా దృష్టిలో పెట్టుకొని , సినిమాను థియేటర్లలో విడుదల చేయాలా..? లేక అమెజాన్లో విడుదల చేయాలా.? అని నిర్మాతలు సందిగ్ధంలో పడినట్లు తెలుస్తోంది.

ఇకపోతే నాని నటించిన టక్ జగదీశ్ సినిమా విడుదల ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని పలువురు సినీ ప్రముఖులు చెబుతున్నారు. సురేష్ బాబు వంటి బడా నిర్మాత కూడా విక్టరీ వెంకటేష్ నటించిన నారాప్ప సినిమాను ఓటీటీలో విడుదల చేసి సొమ్ము చేసుకున్నారు. ఇక ఆఫర్ నచ్చినట్లయితే నిర్మాతలు కూడా ఓటీటీ వేదికగా అమెజాన్ ప్రైమ్ లో నాని టక్ జగదీష్ సినిమాను విడుదల చేస్తారో..? ఏమో..? వేచి చూడాలి.

Share post:

Latest