అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాలు ఏంటో తెలుసా..?

ప్రతి ఒక్కరూ ఒక్కోసారి అనుకోకుండా లేదా కొన్ని కారణాల చేత సినిమా కథలను వదులుకోవాల్సి వస్తుంది. కానీ ఆ సినిమాలే బ్లాక్ బాస్టర్ హిట్ ను సాధిస్తూ ఉంటాయి. ఇక అలా ఎంతో మంది స్టార్ హీరోలు హీరోయిన్లు కూడా మంచి మంచి సినిమా కథలను తమ సినీ జీవితంలో వదులుకున్నారు. అలాంటి వారిలో అనుష్క శెట్టి కూడా కొన్ని చిత్రాలను వదులుకుంది.. అయితే ఇప్పుడు అనుష్క వదులుకున్న బ్లాక్ బస్టర్ మూవీస్ ఏంటో తెలుసుకుందాం..

1. అరుంధతి 2:
దేశవ్యాప్తంగా అనుష్కకు మంచి పేరు తీసుకు వచ్చిన సినిమా అరుంధతి.ఇది కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా.ఇక ఈ సినిమా ఆమె ఇమేజ్ ను మరింత పెంచింది. అయితే కోడి రామకృష్ణ, అనుష్కతో అరుంధతి సీక్వెల్ ను కూడా ప్లాన్ చేసారు. కానీ ఆమె ఆసక్తి చూపించకపోవడంతో ఈ కథ సెట్ పైకి వెళ్లలేదు.

2. మనం:
అక్కినేని ఫ్యామిలీ అంతా కలిసి నటించిన చిత్రం మనం. అయితే ముందుగా శ్రేయ పాత్రలో అనుష్కకి అవకాశం వచ్చింది.కానీ అనుష్కకు డేట్స్ అడ్జెస్ట్ కాక చేయలేకపోయింది.

3. రెబల్:
ప్రభాస్ నటించిన రెబల్ సినిమాలో తమన్నా పాత్ర లో ముందుగా అనుష్కని అనుకున్నారు. కానీ అనుష్క ఆ పాత్రను తిరస్కరించింది.

4. కాంచన:
రాఘవ లారెన్స్ మొదట ఈ మూవీని నాగార్జునతో చేయాలని అనుకున్నాడట. అలాగే అనుష్క ను కూడా హీరోయిన్ గా సంప్రదించడం జరిగింది. ఇక నాగార్జున ఒప్పుకోకపోవడంతో అనుష్క కూడా ఈ సినిమా నుంచి డ్రాప్ అయ్యింది.

5. ఆచార్య:
తండ్రి, కొడుకులు ఇద్దరూ కలిసి నటిస్తున్న చిత్రం ఆచార్య. మొదట కాజల్ పాత్రలో అనుష్క ను, ఆ తర్వాత త్రిషను అనుకున్నారు .కాకపోతే వీళ్ళు ఒప్పుకోకపోవడంతో కాజల్ ని ఫిక్స్ చేయడం జరిగింది.

6. నారప్ప:
వెంకటేష్ నటించిన నారప్ప సినిమాలో కూడా ప్రియమణి కి బదులుగా అనుష్క ను అనుకున్నారు. కానీ ఆమె ఒప్పుకోకపోవడంతో ప్రియమణిని ఫైనల్ చేయడం జరిగింది..