ఒకే సెట్లో బన్నీ, అర్హ..వైరల్ అవుతోన్న ఫోటో

తెలుగు సినీ ఇండస్ట్రీలో బన్నీకున్న క్రేజ్ వేరు. ప్రస్తుతం ఆయన సుకుమార్ డైరెక్షన్ లో పుష్ఫ సినిమాను చేస్తున్నారు. తన కుటుంబం నుంచి అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ హీరోగా సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడు ఆ కుటుంబం నుంచే మరొకరు సినిమా అరంగేట్రం చేయనున్నారు. అది మరెవరో కాదు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ ఓ సినిమాలో నటిస్తున్నారు. గుణశేఖర్ డైరెక్షన్ లో శాకుంతలం సినిమా ద్వారా అర్హ పరిచయం కానుంది.

సినిమాలో అర్హ చిన్నారి భరతుని క్యారక్టర్ చేయనుంది. ఈ తరుణంలో బన్నీ సోషల్ మీడియాలో ఓ ఫోటోను షేర్ చేశాడు. తాను తన కూతురు ఇద్దరూ కూడా ఒకే లొకేషన్ లో పనిచేస్తున్న ఫోటోను షేర్ చేశాడు. తాను తన కూతురు ఇద్దరూ కూడా ఒకే సినిమా సెట్స్ లో నటించడం గొప్ప విషయమని తెలిపాడు. ప్రస్తుతం వారి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Share post:

Latest