చిరంజీవి కి తన స్టైల్ లో విష్ చేసిన అల్లు అర్జున్?

చిరంజీవి ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సినీ ఇండస్ట్రీ కి ఎటువంటి అండదండ లేకుండా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరో రేంజ్ కి ఎదిగాడు. అటువంటి మెగాస్టార్ ని ఆదర్శంగా తీసుకొని ఎంతో మంది ఇండస్ట్రీ కి వచ్చారు. అలాంటి వారిలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఒకరు. చిరంజీవి డాన్స్ ను చూసి ఇంప్రెస్ అయిన అల్లు అర్జున్ చిరంజీవి లా అవ్వాలి అలాగే చిరంజీవి లాగా డాన్స్ చేయాలని అనుకున్నాడు. అలా అనుకున్న విధంగా కష్టపడి ప్రస్తుతం స్టార్ హీరోలలో ఒకరిగా నిలిచారు. అయితే నేడు చిరంజీవి బర్త్ డే సందర్భంగా చిరంజీవితో కలిసి దిగిన ఫోటోను ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా షేర్ చేశాడు బన్నీ.

మీకు, నాకు ఒకే ఒక్క మెగాస్టార్ చిరంజీవి అంటూ తన బర్త్డే విషెస్ తెలియజేశారు.అల్లు అర్జున్ చేసిన పోస్ట్ ప్రస్తుతం మెగా అభిమానులను ఎంతగానో అలరిస్తోంది. అలాగే రెబల్ స్టార్ ప్రభాస్ కూడా హ్యాపీ బర్త్ డే టు మెగా మెగా మెగా మెగాస్టార్ చిరంజీవి గారు ఈ తరానికే కాదు భవిష్యత్ తరాలకు కూడా మీరు స్ఫూర్తి సార్ అంటూ ఒక వీడియో ద్వారా తెలిపాడు. అలాగే విక్టరీ వెంకటేష్ కూడా నన్ను ఎంతగానో ప్రోత్సహించే చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు, అలాగే ముందు ముందు మరెన్నో సక్సెస్లను అందుకోవాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.