కూతురిని చూసి మురిసిపోతున్న బన్ని.. ఏం జరిగిందంటే?

 

 

దివంగత హస్య నటుడు అల్లు రామలింగయ్య వారసుడిగా ఆయన తనయుడు అల్లు అరవింద్ ప్రొడ్యూసర్‌గా టాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. అరవింద్ కుమారుడు బన్ని హీరోగా ఉన్నారు. కాగా, మూడో తరం అనగా బన్ని వారసులు కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఎవరంటే.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి కూతురు అర్హ..గుణశేఖర్ డైరెక్షన్‌లో వస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ ‘శాకుంలం’లో ఓ పాత్ర పోషిస్తుంది. చారిత్రక నేపథ్యమున్న ఈ చిత్రం ద్వారా అర్హ ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇవ్వడం పట్ల అల్లు అరవింద్ కుటుంబీకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ చిత్ర షూటింగ్ సెట్స్‌లోకి తాజాగా బన్ని ఎంట్రీ ఇచ్చారు.

శకుంతల, దుష్యంతుడి కొడుకు భరతుడి పాత్రను అర్హ పోషిస్తోంది. షూట్ సందర్భంగా పలు సీన్లలో అర్హ యాక్టింగ్‌ను లైవ్‌గా చూసిన బన్ని దంపతులు ఆనందం వ్యక్తం చేశారు. ‘శాకుంతలం’ సెట్‌లో బన్ని ఉన్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బన్ని నటిస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ ‘పుష్ప’ ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా విడుదల కాబోతున్నది.

 

Share post:

Latest