వైరల్ వీడియో : బన్నీతో కూతురు అర్హ ఆటలు మములగా లేవుగా..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వస్తున్న పాన్ ఇండియన్ ఫిల్మ్ ‘పుష్ప’. రెండు పార్ట్స్‌గా వస్తున్న ఈ చిత్రంలో బన్నికి జోడీగా క్యూట్ బ్యూటీ రష్మిక మందన నటిస్తోంది. ఈ మూవీ నుంచి మరో రెండ్రోజుల్లో ఫస్ట్ సింగిల్ విడుదల కాబోతున్నది. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ సాంగ్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇకపోతే ‘పుష్ప’ షూటింగ్‌లో బ్రేక్ దొరకగా, బన్ని సరదాగా కూతురితో ఆట ఆడుకున్నారు ఇంట్లో.

ఇందుకు సంబంధించిన వీడియోను స్టైలిష్ స్టార్ వైఫ్ అల్లు స్నేహారెడ్డి ఇన్ స్టా వేదికగా షేర్ చేసింది. దాంతో ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. బబుల్ గన్‌తో బన్నీ బబుల్స్ వదులుతుండగా వాటిని క్యాచ్ పట్టేందుకు బన్నీ కూతురు అర్హ ప్రయత్నిస్తోంది వీడియోలో. చక్కగా నాన్నతో ఆడుతున్న కూతురు అర్హను చూసి అల్లు ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. అర్హ ‘శాకుంతలం’ చిత్రంతో సినీ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి అందరికీ విదితమే.

Share post:

Latest