వాట్సాప్.. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది వాడుతున్న యాప్ ఇది. స్మార్ట్ఫోన్ల వినియోగం పెరిగే కొద్ది.. వాట్సాప్ వినియోగం కూడా పెరిగిపోతోంది. ఎందుకంటే, స్మార్ట్ ఫోన్‌ను కొన్న ప్రతి ఒక్కరూ మొదట డౌన్లోడ్ చేసేది వాట్సాప్‌నే. అయితే ఈ పాపులర్ యాప్‌లో చాలా మందికి చిరాకు పుట్టించేవి గ్రూపులు. ఎవరు పడితే వారు పర్మిషన్ లేకుండా తమను గ్రూప్‌లో యాడ్ చేసేస్తూ ఉంటారు.
మనకు తెలిసిన వాళ్లు యాడ్ చేస్తే పెద్ద సమస్య లేదు కానీ…మనకు తెలియకుండా వేరే ఇతర వాట్సాప్ గ్రూప్‌ల్లో యాడ్ చేస్తే తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. అయితే కొన్ని సింపుల్ ట్రిక్స్‌తో ఈ వాట్సాప్ గ్రూపుల బెడద నుంచి తప్పించుకోవచ్చు. మరి అదెలాగో చూసేయండి.
ముందు వాట్సాప్ ఓపెన్ చేసి కుడివైపున ఉన్న మూడు చుక్కలను క్లిక్ చేసి సెట్టింగ్స్‌లోకి వెళ్లండి. అక్కడ అకౌంట్‌పై క్లిక్ చేసి.. ప్రైవసీలోకి వెళ్లండి. ఇప్పుడు స్క్రీన్‌ను పైకి స్క్రోల్ చేస్తే గ్రూప్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని సెలక్ట్ చేసుకుంటే.. ఎవ్రీవన్, మై కాంటాక్ట్స్, మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్ అనే ఆప్షన్లు ఉంటాయి. వాటిలో మై కాంటాక్ట్ లేదా మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్ ను గానీ ఎంచుకోవాలి. తద్వారా మీ కాంటాక్టు జాబితాలో లేనివారు మనల్ని గ్రూపుల్లో యాడ్ చేయడానికి వీలుండదు.