వామ్మో..శ్రుతిహాస‌న్ అన్ని వేల సార్లు అలా చేయించుకుందా?

క్రాక్‌, వ‌కీల్ సాబ్ వంటి వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ల‌ను ఖాతాలో వేసుకుని మంచి కమ్‌బ్యాక్ ఇచ్చిన అందాల భామ శ్రుతిహాస‌న్.. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ స‌ర‌స‌న స‌లార్‌` చిత్రంలో న‌టిస్తోంది. అలాగే ఇత‌ర భాష‌ల్లోనూ ప‌లు చిత్రాలు చేస్తోంది. ఈ నేప‌థ్యంలోనే షూటింగ్స్ కోసం ముంబై, చెన్నై, హైద‌రాబాద్ అంటూ తిరుగుతూ వ‌స్తోంది.

Don't have daddy, mommy helping me': Shruti Haasan on paying her own bills,  living independently

అయితే అలా ప్రయాణించిన ప్రతీసారి కరోనా పరీక్షలు చేయించుకోడం తప్పనిసరి. అలా హీరో హీరోయిన్లకు మాత్రం ఎన్నో సార్లు పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ఇక శ్రుతి హాస‌న్ కూడా షూటింగ్ వెళ్లే ముందు ఖ‌చ్చితంగా క‌రోనా టెస్ట్ చేయించుకుంటుంద‌ట‌.

Shruti Haasan

ఈ క్ర‌మంలోనే ఆమె ఇప్ప‌టి వ‌ర‌కు ఏకంగా ఐదు వేల సార్లు క‌రోనా టెస్ట్‌లు చేయించుకుంద‌ట‌. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఆమెనే తెలిపింది. ప్ర‌స్తుతం స‌లార్ షూటింగ్‌లో బిజీగా ఉన్న ఈ బ్యూటీ.. తాజాగా టెస్ట్ చేయించుకుంటున్న ఫొటో షేర్ చేస్తూ.. తాను ఇప్పటికి ఐదు వేల సార్లు కరోనా పరీక్షలు చేయించుకున్నాను. అయినా కూడా సేఫ్టీనే ఫస్ట్ కదా? అని చెప్పుకొచ్చింది. ఏదేమైనా ఐదు వేల సార్లు టెస్ట్ చేయించుకోవ‌డం అంటే మామూలు విష‌యం కాద‌నే చెప్పాలి.

Share post:

Popular