వాటిని దొంగిలించ‌డం అంటే మ‌హా ఇష్ట‌మంటున్న ఆమ‌ని!

ఆమ‌ని.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `జంబలకిడిపంబ` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈమె.. మొద‌టి సినిమాతోనే మంచి విష‌యాన్ని అందుకున్నారు. ఆ త‌ర్వాత ఆమ‌ని న‌టించిన శుభలగ్నం చిత్రం సైతం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. దాంతో త‌క్కువ స‌మ‌యంలోనే ఎక్కువ క్రేజ్ సంపాదించుకుని వ‌రుస ఆఫ‌ర్ల‌తో ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగిందీమె.

Actress Amani Photos (15) | Telugu Sira | Flickr

ప్ర‌స్తుతం సాయ‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఆమ‌ని..మ‌రోవైపు బుల్లితెర‌పై సంద‌డి చేసేందుకు సిద్ధం అవుతోంది. ఈమె న‌టిస్తోన్న `ముత్యమంతా ముద్దు` సీరియల్ జీ తెలుగులో ప్ర‌సారం అవుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఆమ‌ని తన స్నేహితురాలు, నటి ఇంద్రజతో కలిసి ‘ఆలీతో సరదాగా’లో సందడి చేయ‌గా.. అందుకు సంబంధించి ప్రోమో బ‌య‌ట‌కు వ‌చ్చింది.

Actress Aamani HD Photos At Chaavu Kaburu Challaga Movie Pre Release Event  | South Celebrities

ఇక ఈ టాక్ షోలో ఆమ‌ని ఎన్నో విష‌యాల‌ను షేర్ చేసుకుంది. తనకు ఐదేళ్ల సంవత్సరం నుండి సినిమాలు అంటే పిచ్చి అని ఆ సమయంలోనే శ్రీదేవి, జయసుధలను తలుచుకుంటూ వారిలా ఎప్పుడు నటిస్తానో అని అనుకునేదాన్ని చెప్పుకొచ్చింది. అలాగే మామిడి పండ్ల‌ను దొంగిలించి తిన‌డం అంటే మ‌హా ఇష్ట‌మ‌ని త‌న చిలిపి కోరిక‌ను బ‌య‌టపెట్టింది. అంతేకాదు, కెరీర్ ఆరంభంలో అంత పెద్ద అందగత్తె కాదు అని త‌న‌ను బంధువులు ఎగతాళి చేశారని కూడా చెప్పుకొచ్చింది. దాంతో ఆమ‌ని వ్యాఖ్య‌లు ఇప్పుడు వైర‌ల్‌గా మారాయి.

Share post:

Latest