మ‌హేష్‌కు బిగ్ షాక్‌..`సర్కారువారి పాట` వీడియో లీక్‌!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుకు లీకుల వీరులు బిగ్ షాక్ ఇచ్చారు. ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ `స‌ర్కారు వారి పాట` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. బ్యాంకింగ్‌ వ్యవస్థలో జరుగుతున్న మోసాలు, అవినీతికి సంబంధించిన సామాజిక అంశం నేప‌థ్యంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది.

మైత్రీ మూవీమేక‌ర్స్‌, 14 రీల్స్ ప్ల‌స్‌, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా మొదటి షెడ్యూల్ దుబాయ్‌లో మొదలైనప్పటినుంచి తాజా షెడ్యూల్ వరకూ సెట్‌లోని కొన్ని పిక్స్ లీకవుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏకంగా ఓ డైలాగ్ వీడియో లీక్ చేసేశారు లీకుల వీరులు.

ఈ వీడియోలో `పొద్దున్నే లేచి వాకింగ్‌ చేశామా?.. మంచి డైట్‌ ఫుడ్‌ తిన్నామా? మళ్లీ సాయంత్రం అయ్యాక మొబైల్‌ చూశామా?, కొడుకు, మనవడు, మనవరాలితో ఆడుకుని.. మళ్లీ తిని పడుకున్నామా? లేదా?, ఇదే కదా మనం చేసేది రోజూ..` అని మహేష్ బాబు డైలాగ్ చెబుతాడు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్‌గా మారింది. ఇక ఇది తెలుసుకున్న చిత్ర యూనిట్ ఇక‌పై ఏ లీకు కాకుండా.. మ‌రిన్ని క‌ఠిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ట‌.

Share post:

Latest