మ‌హేష్ `స‌ర్కారు వారి పాట‌`కు టార్గెట్ ఫిక్స్‌!?

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

క‌రోనా సెకెండ్ వేవ్‌కు ముందే కొంత షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. మ‌ళ్లీ త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది. తాజా స‌మాచారం ప్ర‌కారం.. జూలై 15 నుంచి హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ రీ స్టార్ట్ అవుతుంద‌ని తెలుస్తోంది.

అంతేకాదు, ఈ సినిమా షూటింగ్‌ను సెప్టెంబరు కల్లా పూర్తి చేయాలనే టార్గెట్‌ను కూడా ఫిక్స్‌ చేసుకున్నారట మ‌హేష్‌. ఇక ఈ సినిమా త‌ర్వాత మ‌హేష్ త‌న త‌దుప‌రి చిత్రాన్ని మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్‌తో చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే.

Share post:

Popular