ఇప్ప‌టికైనా హీరోల తీరు మారాలి..తాప్సీ షాకింగ్ కామెంట్స్‌!

ఝుమ్మందినాదం సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అందాల భామ తాప్సీ.. ప్ర‌స్తుతం బాలీవుడ్ చిత్రాల‌తో బిజీ బిజీగా గ‌డుపుతున్న సంగ‌తి తెలిసిందే. అలాగే ఇటీవ‌ల నిర్మాత‌గా కూడా మారిన తాప్సీ..`అవుట్‌సైడర్‌ ఫిలింస్‌` పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించింది.

ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న త‌ప్సీ స్టార్ హీరోల తీరు మారాలి అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. `లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాల్లో నటించడానికి స్టార్ హీరోలు అస్స‌లు ఒప్పుకోరు. ఎందుకంటే, ఇలాంటి చిత్రాల్లో హీరో పాత్ర న‌డివి త‌క్కువ‌గా ఉంటుంది. కథ మొత్తం హీరోయిన్ చుట్టునే తిరుగుతుంది.

కాబట్టి తమ ఇమేజ్‌ తగ్గిపోతుందని స్టార్ హీరోలు భావిస్తారు. కానీ, హీరోయిన్లు మాత్రం అగ్ర హీరోల సినిమాల్లో చిన్న పాత్రైనా ఇమేజ్ గురించి ప‌ట్టించుకోకుండా న‌టిస్తారు. అందుకే ఇప్ప‌టికైనా ఇమేజ్‌ పట్టింపుల‌కు పోకుండా హీరోలు హీరోల‌తో క‌లిసి సమన్వయంతో పనిచేస్తే మరిన్ని గొప్ప చిత్రాలొస్తాయి.` అంటూ చెప్పుకొచ్చింది.