మ‌ళ్లీ టాలీవుడ్‌లో సన్నీలియోన్ సంద‌డి..ఫ్యాన్స్‌కు పండ‌గే!

సన్నీలియోన్.. ఈ పేరు తెలియ‌ని వారుండ‌రు. త‌న అంద‌చందాల‌తో వ‌ర‌ల్డ్ వైడ్‌గా క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ..ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంది. ఫ్యామిలీ కోసం అడల్ట్ సినిమాల్లో నటించింది. ఆ త‌ర్వాత అడ‌ల్ట్ ఇండ‌స్ట్రీ నుంచి త‌ప్పుకుని.. బాలీవుడ్‌లోకి అడుగు పెట్టి త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.

ఆ త‌ర్వాత ఇత‌ర భాష‌ల్లోనూ న‌టించి మెప్పించింది. ఇక టాలీవుడ్‌లో మంచు మనోజ్ హీరోగా తెర‌కెక్కిన కరెంట్ తీగ చిత్రంలో.. స‌న్నీ స్పెష‌ల్ సాంగ్ చేసి తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా క‌నెక్ట్ అయింది. అయితే లాంగ్ గ్యాప్ త‌ర్వాత మ‌ళ్లీ ఈ బ్యూటీ టాలీవుడ్‌లో సంద‌డి చేసేందుకు రెడీ అయింది. క‌న్న‌డ భాష‌లో వ‌స్తున్న కాట‌న్ పేట్ గేట్ చిత్రాన్ని.. తెలుగులో సీత‌న్న‌పేట గేట్ పేరుతో రూపొందిస్తున్నారు

వై రాజ్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో ఓ అదిరిపోయే ఐటెం సాంగ్ ఉంద‌ట‌. ఆ సాంగ్‌లో స‌న్నీలియాన్ న‌టించ‌నుంది. హైద‌రాబాద్‌లోనే ఈ పాట‌ను షూట్ చేయ‌బోతున్నారు. జూలై చివ‌ర‌లో షూటింగ్ మొద‌లుకానున్న‌ట్టు టాక్‌. మ‌రి ఈ సారి స‌న్నీ త‌న ఫ్యాన్స్ ను ఏ మేర‌కు అల‌రించ‌నుందో చూడాలి.

Share post:

Latest