గ్రాండ్ ఫాదర్ అంటూ భ‌ర్త‌పై నెటిజ‌న్ కామెంట్..సునీత షాకింగ్ రిప్లై!

టాలీవుడ్‌లో సింగ‌ర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్టుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సునీత‌.. పోయిన జ‌న‌వ‌రిలో మ్యాంగో వీడియోస్ అధినేత రామ్ వీరపనేనిని వివాహం చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన సంగ‌తి తెలిసిందే. వీళ్లిద్దరికి ఇది రెండో పెళ్లి.

వీరి పెళ్లిపై సోషల్ మీడియాలో విభిన్న వాదాలు వ‌చ్చిన‌ప్ప‌టికీ.. వాటిని సునీత ఏ మాత్రం ప‌ట్టించుకోలేదు. పెళ్లి తర్వాత సరికొత్త జీవితం ఎంతో ఆనందంగా గడుపుతోంది. అయితే తాజాగా ఓ నెటిజ‌న్ మ‌రింత దిగ‌జారి సునీత‌, రామ్ వీరపనేనితో సన్నిహితంగా ఉన్న ఫోటోపై.. గ్రాండ్ ఫాదర్, ఆంటీ అంటూ కామెంట్ చేసాడు. ఇద్దరు ముసలోళ్లు అంటూ ఫోటో కింద రాసుకొచ్చాడు.

ఇది చూసిన సునీత‌.. అత‌డికి షాకింగ్ రిప్లై ఇచ్చింది. గాడ్ బ్లెస్ యు నాన్న.. బుర్ర మాత్రమే కాదు నువ్వు మనిషిగా కూడా చాలా ఎదగాలి.. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులను చూస్తుంటే జాలిగా ఉంది.. నీ సంస్కారానికి నమస్కారాలు అంటూ స‌ద‌రు నెటిజ‌న్‌కు దిమ్మ‌తిరిగే కౌంట‌ర్ ఇచ్చింది.

Share post:

Latest