అద్భుతం మూవీతో ఎంట్రీ ఇస్తున్న శివాని రాజ‌శేఖ‌ర్‌…!

టాలీవుడ్ లో జీవిత రాజశేఖర్ లకు ఇద్దరు కూతుర్లు ఉన్నార‌న్న విష‌యం అంద‌రికీ విదిత‌మే. వారిద్ద‌రిలో ఇప్పటికే శివాత్మిక దొరసాని మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తన క్యూట్ నటనతో పాటు అందంతో ప్రేక్షకులను క‌ట్టిప‌డేసింది. ఇక ప్రస్తుతం ఈ అమ్మ‌డు తెలుగుతోపాటే మలయాళ భాష‌లో కూడా సినిమాల్లో మెరుస్తోంది. ఇదిలా ఉండగా ప్ర‌స్తుతం జీవిత రాజశేఖర్ మరో కుమార్తె అయిన శివాని కూడా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వ‌డానికి రెడీ అవుతోంది. ఇప్ప‌టికే శివాని మొదటి మూవీ అయిన అద్భుతం సినిమా పోస్టర్ ను కూడా రిలీజ్ చేసిన సంగ‌తి తెలిసిందే.

ఇక ఈ మూవీలో తేజ సజ్జ హీరోగా చేస్తున్నారు. తేజ సజ్జ ఇప్పటికే జాంబీ రెడ్డి మూవీతో మంచి గానే ఆకట్టుకున్నారు. దాంతో పాటే హనుమాన్ అనే మరో మూవీలో తేజ నటిస్తున్నారు. ఇక అద్బుతం మూవీకి మాలిక్ రామ్ అనే వ్య‌క్తి దర్శకత్వం చేస్తున్నారు. ఈరోజు శివాని పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన ఈ మూవీ పోస్టర్ ఎంతగానో ఆకట్టుకుంటోంది. అయితే ఈ పోస్టర్ టైటిల్ కు తగ్గట్టుగా అద్భుతంగా ఉంది. మరి శివాని టాలీవుడ్ కు ఎంట్రీ అవుతున్న ఈ మూవీ ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.

Share post:

Latest