ఆ స్టార్ హీరో మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న స‌త్య‌దేవ్‌!

టాలీవుడ్ టాలెంటెడ్ యాక్ట‌ర్ స‌త్య‌దేవ్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మిస్టర్ ఫర్ఫెక్ట్ సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన స‌త్య‌దేవ‌.. జ్యోతిలక్ష్మి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆ త‌ర్వాత వ‌చ్చిన బ్లఫ్ మాస్టర్, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య చిత్రాల‌తో స‌త్య‌దేవ్ స‌త్తా ఏంటో అంద‌రికీ తెలిసింది.

Thimmarusu to release on July 30th? | Telugu Cinema

పాత్ర‌లో ప‌ర‌కాయ ప్ర‌వేశం చేసి న‌టించే వారిలో ఈయ‌నా ఒక‌రు. ఇక ప్ర‌స్తుతం హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటిస్తూ దూసుకుపోతున్న స‌త్య‌దేవ్‌.. త్వ‌ర‌లోనే బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. అది కూడా ఓ స్టార్ హీరో మూవీతో. బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్, నుష్రత్‌ ప్రధాన పాత్రల్లో అభిషేక్‌ శర్మ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం రామ సేతు.

Akshay Kumar announces his new film 'Ram Setu' on Diwali | Hindi Movie News  - Times of India

అయితే ఈ చిత్రంలో ఓ కీల‌క పాత్ర కోసం స‌త్య‌దేవ్‌ను తీసుకున్నారు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా స‌త్య‌దేవ్‌నే వెల్ల‌డించాడు. `కొన్ని విషయాలు మనం ఊహించకుండానే జరిగిపోతుంటాయి. నా బాలీవుడ్‌ పరిచయం కూడా అంతే. నేను నా ప్రొఫైల్‌ను బీ టౌన్‌లో షేర్‌ చేయలేదు. కానీ రామ సేతులో నటించే అవకాశం వచ్చింది. హ్యాపీ అంటూ చెప్పుకొచ్చాడు స‌త్య‌దేవ్‌.