కోలీవుడ్ స్టార్ హీరో ఆర్య నటించిన తాజా చిత్రం ‘సార్పట్ట’ ఓటీటీ వేదికగా విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ‘సార్పట్ట పరంబరై’, ‘కబాలి’ వంటి చిత్రాలు రూపొందించిన రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ కు ఇప్పటికే మంచి స్పందన వచ్చింది. కథలోకి వెళితే.. బ్రిటిష్ వారు సరదాగా భారతీయులకు నేర్పించిన బాక్సింగ్ ఆట చివరికి సార్పట్ట-ఇడియప్ప అనే రెండు వంశాల మధ్య కొట్లాటకు దారి తీసింది. దానిలో వేటపులి అనే ప్రత్యర్థి బాక్సర్ ని ఓడిస్తానని సవాలు చేసిన ఆర్య..ఆటకు ఎందుకు దూరం అయ్యాడు.. మళ్ళీ ఎలా తిరిగి రింగ్ లో అడుగు పెట్టాడు.. ఇంతకీ తన ఛాలెంజ్ గెలిచాడా అనేది ఈ సినిమా కాన్సెప్ట్.
ఈ చిత్రంలో దుషారా విజయన్ హీరోయిన్ గా కనిపిస్తోంది. సంతోష్ నారాయణన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి మురళి జి సినిమాటోగ్రఫీ అందించారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో జూలై 22న ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ‘సార్పట్ట’ తమిళ ట్రైలర్ ను హీరో సూర్య విడుదల చేయగా.. తెలుగులో ఈ ట్రైలర్ ను హీరో రానా దగ్గుబాటి తన ట్విట్టర్ ఖాతా ద్వారా రిలీజ్ చేశాడు.