ఆ విషయంలో రకుల్ – శిల్పా శెట్టి మధ్య పోటీ..?

July 17, 2021 at 2:03 pm

టాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ , ఒకప్పుడు తన అంద చందాలతో తెలుగు కుర్రకారుకు నిద్ర చెడగొట్టిన శిల్పాశెట్టితో అందంలో పోటీపడుతుందేమో అన్నట్లు వారు దిగిన ఫొటోలు దర్శనమిస్తున్నాయి. ఇద్దరూ సేమ్ ఒకేలా కనిపించే దుస్తులతో దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

అందంలో ఎవరెక్కువ అన్నట్లు ఉన్న ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు శిల్పా శెట్టికి ఇద్దరు సంతానం కలిగినా ఇంకా అందంలో 20 ఏళ్ల అమ్మాయిలా హొయలొలికిస్తోందని అంటున్నారు. కొంత మంది మాత్రం రకుల్ ప్రీత్ కు ఏం తక్కువ అని కామెంట్లు చేస్తున్నారు. అందాల అమ్మడు శిల్పాశెట్టి పెళ్లి తర్వాత ఎక్కువగా అందాల ఆరబోత మీద కాన్సంట్రేట్ చేయలేదు. కానీ ఈ అమ్మడు ప్రస్తుతం తెలుగు తెర మీద మరలా మెరవడానికి వస్తున్నట్లు పలువురు కామెంట్లు చేస్తున్నారు. వీరు ధరించిన దుస్తుల డిజైన్ వేర్వేరుగా ఉన్నా క్లాత్ కలర్ మాత్రం ఒకేలా కనిపిస్తోంది. ఈ ఫొటోలతో నెటిజన్లు పండుగ చేసుకుంటున్నారు.

ఆ విషయంలో రకుల్ – శిల్పా శెట్టి మధ్య పోటీ..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts