వెంకీ `నార‌ప్ప‌`పై స‌మంత రివ్యూ!

విక్ట‌రీ వెంక‌టేష్‌, ప్రియ‌మ‌ణి జంట‌గా న‌టించిన తాజా చిత్రం `నార‌ప్ప‌`. తమిళ సూపర్‌హిట్ అసురన్ కు రీమేక్‌గా ఈ సినిమాను రూపొందించారు. శ్రీకాంత్‌ అడ్డాల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ యాక్ష‌న్ డ్రామా చిత్రాన్ని సురేశ్‌ ప్రొడక్షన్స్‌, వీ క్రియేషన్స్ బ్యాన‌ర్ల‌పై సురేశ్‌ బాబు, కలైపులి ఎస్‌. థాను సంయుక్తంగా నిర్మించారు.

జూలై 20న ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వేదిక‌గా విడుద‌లైన ఈ చిత్రానికి మంచి టాక్ వ‌చ్చింది. ఎలాంటి పాత్రలోనైనా అవలీలగా పరకాయ ప్రవేశం చేసి మెప్పించగలిగే వెంకీ.. నారప్ప గా అదరగొట్టేశాడు. ఇక తాజాగా అక్కినేని వారి కోడ‌ల స‌మంత ఈ సినిమాపై రివ్యూ ఇచ్చింది. తాజాగా నార‌ప్ప‌ను చూసింత స‌మంత‌.. సినిమా అద్భుతంగా ఉంద‌ని తెలిపింది.

ఈ క్ర‌మంలోనే తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్‌లో నారప్ప మూవీ పోస్టర్‌ను పెట్టి.. `వావ్… వావ్ వ్ వ్ వ్ వ్..` అంటూ కామెంట్ పెట్టింది. స‌మంత పోస్ట్ చూస్తుంటే.. ఈమెకు నార‌ప్ప బాగా న‌చ్చేసింద‌ని స్ప‌ష్టంగా అర్థ‌మైంది. కాగా, నెటిజ‌న్లు కూడా నార‌ప్ప‌పై పాజిటివ్ టాక్ వ్య‌క్తం చేస్తున్నారు.

Samantha Akkineni lauds Venkatesh Daggubati's performance in Narappa - Movies News

Share post:

Latest