అల్లు అర్హ సినీ ఎంట్రీపై స‌మంత ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

అల్లు వారి నాల్గొవ త‌రం, టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారాల ప‌ట్టి అల్లు అర్హ‌.. సినీ ఎంట్రీ ఇవ్వ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. అది కూడా పాన్ ఇండియా చిత్రంతో అర్హ గ్రాండ్ ఎంట్రీ ఇస్తోంది. డైరెక్టర్ గుణశేఖర్ తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం `శాకుంతలం`. ఈ చిత్రంలో అక్కినేని సమంత శకుంతల పాత్ర‌లో, మలయాళ హీరో దేవ్ మోహన్ దుష్యంతుడు పాత్ర‌లో నటిస్తున్నారు.

టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ.. పాన్ ఇండియా మూవీతో అల్లు అర్హ వెండితెర ఎంట్రీ..! |  all set to allu arha tollywood entry plying a role in samantha shakunthalam  ksr

అయితే శకుంతల కుమారుడు భరతుడి పాత్ర కోసం అర్హను తీసుకున్నారు. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చింది. ప్ర‌స్తుతం శాకుంత‌లం హైద‌రాబాద్‌లోనే శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఇదిలా ఉంటే.. అర్హ సినీ ఎంట్రీపై సోష‌ల్ మీడియా వేదిక‌గా స‌మంత ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది.

allu arha: అల్లు అర్హ సినీ ఎంట్రీ.. అమ్మ బాబోయ్ ఇది మామూలుగా ప్లానింగ్  కాదు.. బన్నీ ఎమోషనల్ - allu arjun about arha entry in samantha shakuntalam  movie | Samayam Telugu

ఇంత గొప్ప ప్రాజెక్ట్ ద్వారా బ‌న్నీ కూతురు ఎంట్రీ ఇస్తుండ‌డంపై సంతోషం వ్య‌క్తం చేసిన స‌మంత‌..ఫస్ట్ టేక్ అయిపోయింద‌ని, అర్హ అదరగొట్టేసింద‌ని తెలిపింది. అలాగే అర్హ‌కు రాసిన డైలాగ్స్ అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయ‌ని సమంత చెప్పుకొచ్చారు. ఇక సమంత చేసిన ఈ పోస్ట్ మీద స్నేహారెడ్డి..షాట్స్‌లో అర్హకు సాయం చేస్తున్నందుకు థ్యాంక్స్ అని పేర్కొన్నారు. మ‌రోవైపు సమంత పోస్ట్ మీద బన్నీ కూడా స్పందిస్తూ.. థ్యాంక్యూ సో మచ్ అని చెప్పేశారు.

Samantha Arha

Share post:

Latest