`ఆర్ఆర్ఆర్‌` మేకింగ్ వీడియో అదిరిందంతే!!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా రాజ‌మౌళి తెర‌కెక్కించిన భారీ మ‌ల్టీస్టార‌ర్ ఆర్ఆర్ఆర్‌. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియన్ మూవీలో అలియా భట్‌, ఒలీవియా మోరీస్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. అలాగే బాలీవుడ్‌ స్టార్ అజయ్‌ దేవగణ్, శ్రియ, సముద్రఖని త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు.

RRR Making Video: SS Rajamouli Has Created The Biggest Ever Magnum Opus In  India & Here's The Ultimate Proof

అయితే ఈ రోజు రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్ పేరుతో ఓ మేకింగ్ వీడియోను విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే చెప్పిన‌ట్టుగానే తాజాగా మేకింగ్‌ను వీడియో విడుద‌ల చేశారు. ఒక‌టిన్న‌ర నిమిషానికి పైగానే ఉన్న ఈ వీడియో ఆధ్యంతం ఎంతో అద్భుతంగా సాగింది.

ఆర్ఆర్ఆర్ కోసం చిత్ర యూనిట్ ఎంత క‌ష్ట‌ప‌డింతో.. స్ప‌ష్టంగా ఈ వీడియోలో క‌నిపిస్తోంది. అలాగే ఈ వీడియోకు లెజెండరీ సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ పీక్స్‌లో ఉంద‌ని చెప్పాలి. మొత్తానికి అదిరిపోయిన ఈ మేకింగ్ వీడియో.. ఆర్ఆర్ఆర్ పై మ‌రిన్ని అంచ‌నాల‌ను పెంచేసింది. ఇక దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబ‌ర్ 13నే విడుద‌ల కానుంద‌ని మ‌రోసారి ఈ వీడియోలో స్ప‌ష్టం చేశారు.

Share post:

Latest