ఆరోజే విడుదల కానున్న ఆర్ఆర్ఆర్ గ్లింప్స్..?

భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా మేకింగ్ కి సంబంధించి ఒక గ్లింప్స్ వీడియో త్వరలోనే విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని తాజాగా చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ప్రముఖ నిర్మాణ సంస్థ డివివి ఎంటర్టైన్మెంట్స్ తాజాగా ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ షేర్ చేసింది. “రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్” వీక్షించేందుకు సిద్ధం కండి. జులై 15, ఉదయం 11 గంటలకు ఆర్ఆర్ఆర్ సినిమా మేకింగ్ కి సంబంధించి ఒక గ్లింప్స్ విడుదల కానుందని చిత్ర బృందం ప్రకటించింది.

- Advertisement -

అయితే ఈ పోస్ట్ కి ఒక ఫొటో కూడా జత చేసింది. ఆ ఫోటోలో ఒక భారీ సెట్ నిర్మించడం మనం చూడొచ్చు. సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉన్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా గ్లింప్స్ వీడియో విడుదల చేస్తున్నారని తెలుస్తోంది. త్వరలోనే వరుసగా పోస్టర్లు కూడా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

Share post:

Popular