మరో రికార్డ్ సొంతం చేసుకున్న రష్మిక ..?

ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యింది కన్నడ బ్యూటీ రష్మిక. ‘చలో’తో తళుక్కుమన్న రష్మికకి గీతగోవిందం సినిమా తరువాత క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. తరువాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదు. టాప్ హీరోలతో జతకట్టి సరిలేరు నీవెవ్వరూ అనిపించుకునే స్థాయికి చేరింది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తూ.. ఫాన్స్ కి అందుబాటులోనే ఉంటుంది.

తనదైన స్టైల్ లో అల్లరి చేస్తూ ప్రేక్షకులకు, ఫాలోవెర్స్ కి ఇట్టే నచ్చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మరో రికార్డ్ సాధించింది. తన ఇన్‏స్టాలో ఫాలోవర్స్ సంఖ్య 19 మిలియన్లకు చేరినట్టు అభిమానులతో పంచుకుంది. ఇదిలా ఉంటే ఇటీవల రష్మిక తన లెటేస్ట్ ఫోటో ఒకటి ఇన్‏స్టాలో షేర్ చేశారు. “నేను కళ్లతో మాట్లాడాలని అనుకుంటున్నాను.. దీనికి మీరు ఎలాంటి క్యాప్షన్ పెట్టాలనుకుంటున్నారు” అని తన ఫాలోవర్లను ప్రశ్నించింది. ఆమె అలా పోస్ట్ పెట్టిందో లేదో ఇప్పుడు ఆ ఫోటో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. మరి మీరు ఏ క్యాప్షన్ పెట్టాలి అనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి

Share post:

Latest