RC15 సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే..?

స్టార్ డైరెక్టర్ శంకర్- మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో ‘RC15’ అనే భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇది రామ్ చరణ్ 15వ చిత్రం. ఒక నిజాయితీ గల ఐఏఎస్ ఆఫీసస్ రాజకీయాల్లోకి వెళితే ఎలాంటి మార్పులు తీసుకువస్తాడు అనే కాన్సెప్ట్ తో ముందుకు వస్తున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. అయితే రామ్ చరణ్- శంకర్ కాంబోలో వస్తున్న ఈ పాన్ ఇండియా మూవీకి మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎస్ఎస్ థమన్ ఫైనల్ అయ్యారు.

ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన తరువాత ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏ.ఆర్.రెహమాన్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌లలో ఒకరిని చిత్రబృందం పరిశీలిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ తాజాగా చిత్ర యూనిట్ తమన్ ని ఫైనల్ చేసి ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా ఈ మూవీకి నటీ, నటులతో పాటు టెక్నికల్ టీంని ఎంచుకునే పనిలో చిత్ర బృందం ఉంది. ఒకప్పుడు శంకర్ రూపొందించిన ‘బాయ్స్’ సినిమాలో నటించిన తమన్ శంకర్ సినిమాకు మ్యూజిక్ డైరెక్షన్ చేయడం ఇద్దరికీ ఓ మంచి అనుభూతే..