బుల్లితెరపై మకుటం లేని మహారాణి, స్టార్ యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా పరిచాయలు అవసరం లేదు. రోజుకో కొత్త యాంకర్ వచ్చి అందాలు ఆరబోస్తున్నా.. సుమ క్రేజ్ ఏ మాత్రం డౌన్ అవ్వడం లేదు. వరుస టీవీ షోలు, సినిమా ఈవెంట్లతో బిజీ బిజీగా గడుపుతూ.. హీరోయిన్ రేంజ్‌లో సంపాదిస్తుంది.
ఇదిలా ఉంటే.. సుమ, ఆమె భర్త రాజీవ్ కనకాల విడి విడిగా ఉండటంతో.. వీరిద్దరూ విడిపోయారని, విడాకులు తీసుకున్నారని గతంలో ఎన్నో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ, అవన్నీ పుకార్లే అని ఈ దంపతులు అనేక సార్లు తేల్చి చెప్పారు. అయితే రాజీవ్ సుమకు దూరంగా ఉండటానికి కారణం ఏంటో రివిల్ చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాజీవ్ మాట్లాడుతూ.. నిజంగానే కొన్ని రోజులు సుమతో విడిగా ఉండాల్సి వచ్చిందని చెప్పాడు.
`2018 వరకు అందరం కలిసే ఉన్నాము. అయితే అమ్మ పోయిన తర్వాత నాన్నను కూడా తమ దగ్గరికి షిఫ్ట్ చేద్దామనుకుంటే.. ఆయన బుక్ లైబ్రరీ చాలా పెద్దగా ఉంది. అది తమ ఇంట్లో పట్టకపోవడంతో నాన్న అక్కడే ఉంటానన్నారు. దాంతో తాను కూడా నాన్న వద్దే ఉండాల్సి వచ్చింది. దాంతో సుమ, నేను విడిపోయామని వార్తలు పుట్టుకొచ్చాయి. కానీ, అవి నిజం కాదు. మేము విడిగా ఉన్నామే తప్పా.. ఎప్పుడూ విడిపోలేదు` అంటూ చెప్పుకొచ్చాడు రాజీవ్ కనకాల.