ఆమె డైరెక్ష‌న్‌లో ర‌జ‌నీ నెక్స్ట్ ప్రాజెక్ట్‌..త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న‌?

సౌత్ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీ కాంత్ తాజా చిత్రం అన్నాత్తే. సిరుతై శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. నవంబరు 4న దీపావళి కానుకగా విడుద‌ల కానున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్, నయనతార, మీనా, ఖుష్బూ, జగపతి బాబు, ప్రకాష్ రాజ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

- Advertisement -

అయితే అన్నాత్తే త‌ర్వాత ర‌జ‌నీ నెక్స్ట్ ప్రాజెక్ట్‌ ఏ డైరెక్ట‌ర్‌తో ఉంటుందా అని అంద‌రూ ఆస‌క్తి ఎదురు చూస్తున్న త‌రుణంతో.. ఓ ఇంట్ర‌స్టింగ్ న్యూస్ నెట్టింట వైర‌ల్‌గా మారింది. రజనీకి ఇటీవల ఎంతో మంది డైరెక్టర్‌లు కథ వినిపించ‌గా.. అందులో ఆయన కూతురు సౌందర్య కూడా ఉంద‌ట‌.

soundarya rajnikanth (@soundaryaarajni) | Twitter

అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. ర‌జ‌నీ త‌న త‌ర్వాతి సినిమాను కూతురు డైరెక్ష‌న్ లో చేసేందుకే ఎక్కువ మొగ్గు చూపిస్తున్నార‌ని తెలుస్తోంది. అంతేకాదు, ర‌జ‌నీ కెరీర్‌లో ఇదే చివ‌రి చిత్రమ‌ని కూడా ప్ర‌చారం జ‌రుగుతోంది. చివరిగా కూతురు డైరెక్షన్‌ నటించి విశ్రాంతి తీసుకోవాల‌ని ర‌జ‌నీ భావిస్తున్నార‌ట‌. ఈ నేపథ్యంలోనే ఆయన కోసం కూతురు సౌందర్య స్క్రిప్ట్ కూడా సిద్దం చేసేసింద‌ని.. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్‌పై ప్ర‌క‌ట‌న రానుంద‌ని టాక్‌.

Share post:

Popular