రాదే శ్యామ్ షూటింగ్ ప్రారంభం.. ఎప్పటి నుంచి అంటే..?

డార్లింగ్ ప్రభాస్, స్లిమ్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా ‘రాధేశ్యామ్‌’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెల్సిందే. ఈ మూవీ ఎప్పుడెప్పుడూ రిలీజ్ అవుతుందా అని ప్రభాస్ ఫాన్స్ ఎంతో ఉత్సహంతో ఎదిరి చూశారు. అయితే ఈ లోగా కరోనా మహమ్మారి కారణంగా షూటింగ్ లకు ఒక్కసారిగా ఫుల్ స్టాప్ పడిపోయింది. కరోనా సెకండ్‌ వేవ్‌ కంటే ముందే..ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. ఒక్క పాట షూట్ చేస్తే సినిమా చిత్రీకరణ పూర్తవుతుంది.

కానీ కోవిడ్ కారణంగా సినిమాకి బ్రేక్ పడిపోయింది. ప్రస్తుతం వైరస్ తగ్గుముఖం పడుతుండడంతో షూటింగ్ లకు పర్మిషన్ వచ్చేసింది. దీంతో చిత్రబృందం చిత్రీకరణకు సిద్ధమైంది. ఈ నెల 22 నుంచి ఈ సినిమా షూటింగ్‌ మొదలెడుతున్నట్టు సమాచారం వచ్చింది. ప్రభాస్‌, పూజాలపై పాట చిత్రీకరించిన తరువాత వెంటనే పోస్ట్‌ప్రొడక్షన్‌ పనులు పూర్తి చేసి రిలీజ్‌ డేట్‌ను ప్రకటించే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్టు తెలుస్తోంది. ప్రభాస్ ఫిల్మ్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదిరిచూసే ఫాన్స్ కి ఇదొక గుడ్ న్యూసే కదా.