ఎన్టీఆర్ టీవీ షోలో ఫ‌స్ట్ గెస్ట్ ఆయ‌నేన‌ట‌?!

టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ మ‌రోసారి బుల్లితెర‌పై సంద‌డి చేసేందుకు సిద్ధ‌మైన‌ సంగ‌తి తెలిసిందే. ఎన్టీఆర్ హోస్ట్ గా జెమినీ టీవీలో `ఎవరు మీలో కోటీశ్వరులు` రియాలిటీ షో అతి త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంది. జులై 10 నుంచి ఎన్టీఆర్ ఈ షో షూటింగ్‌లో కూడా పాల్గొంటున్నారు.

Jr NTR to host Evaru Meelo Koteeswarulu, calls the show a 'big  responsibility.' Watch teaser | Entertainment News,The Indian Express

అయితే ఇప్పుడు ఈ షోకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ వార్త నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఇంత‌కీ మ్యాట‌ర్ ఏంటంటే.. ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌బోయే ఈ షోకు ఫ‌స్ట్ గెస్ట్‌గా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ రానున్నార‌ని తెలుస్తోంది. అంతేకాదు, చ‌ర‌ణ్ ఎన్టీఆర్‌తో క‌లిసి ఈ షో షూట్‌లో కూడా పాల్గొన్న‌ట్టు ప్ర‌చారం న‌డుస్తోంది.

RRR actor Ram Charan to be the first guest on Jr NTR's upcoming TV show  Meelo Evaru Koteeswarudu? | PINKVILLA

మ‌రి ఈ ప్ర‌చార‌మే నిజ‌మైతే.. కొమ‌రం భీమ్‌, అల్లూరి సీతారామ‌రాజుల‌ను బిగ్ స్క్రీన్ కంటే ముందే స్మాల్ స్క్రీన్‌పై చూస్తారు. కాగా, ఎన్టీఆర్.. రామ్ చ‌ర‌ణ్ క‌లిసి ప్ర‌స్తుతం రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్‌లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబ‌ర్ 13న విడుద‌ల కానుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర కొమ‌రం భీమ్‌గా, చ‌ర‌ణ్ అల్లూరి సీతారామారాజుగా క‌నిపించ‌నున్నారు.

Share post:

Latest