ఓటీటీ వైపు చూస్తున్న నిఖిల్ `18 పేజెస్`..త్వ‌ర‌లోనే..?

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రాల్లో 18 పేజెస్ ఒక‌టి. కుమారి 21ఎఫ్‌ ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అల్లు అరవింద్ స‌మ‌ర్పణ‌లో జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నార‌ట‌. థియేటర్లు ఓపెన్ అయినా, లైన్లో చాలానే సినిమాలు ఉన్నాయి. పాన్ ఇండియా చిత్రాలూ ఉన్నాయి.

వాటి మ‌ధ్య ప‌డి న‌లిగిపోవ‌డం కంటే.. సేఫ్‌గా ఓటీటీలో విడుద‌ల అవ్వ‌డం బెట‌ర‌ని 18 పేజెస్ మూవీ మేక‌ర్స్ భావిస్తున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక త్వరలోనే ఈ విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాగా, విభిన్నమైన ప్రేమకథా నేపథ్యంలో ఈ చిత్రం తెర‌కెక్కింది. ఇందులో సిద్ధు పాత్రలో నిఖిల్, నందిని పాత్రలో అనుపమ క‌నిపించ‌నున్నారు.

Share post:

Latest