మల్టీస్టార‌ర్‌గా శేఖర్ కమ్ముల-ధనుష్ మూవీ..మ‌రో హీరో ఎవ‌రంటే?

త‌మిళ స్టార్ హీరో ధునుష్, టాలీవుడ్ టాలెండెట్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల కాంబోలో త్వ‌ర‌లోనే ఓ చిత్రం తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై నారాయణ్ దాస్ నారంగ్, పి.రామ్మోహన్ రావు నిర్మించ‌నున్నారు.

అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఇంత‌కీ మ్యాట‌ర్ ఏంటంటే.. ఈ చిత్రంలో మ‌రో హీరో కూడా ఉండ‌బోతున్నాడ‌ట. మ‌ల్టీస్టార‌ర్‌గా ఈ చిత్రం తెర‌కెక్క‌బోతోంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

అయితే మరో హీరో కోలీవుడ్ నటుడా..? లేక టాలీవుడ్ నటుడా? అన్న‌ది తెలియాల్సి ఉంది. కాగా, త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌నున్న ఈ చిత్రంపై ఇప్ప‌టికే భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

Share post:

Popular