మ‌హేష్‌-రాజ‌మౌళి సినిమా..బ్యాక్‌డ్రాప్ లీక్ చేసిన ర‌చ‌యిత‌!

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి కాంబినేష‌న్‌లో త్వ‌ర‌లోనే ఓ చిత్రం తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని సీనియ‌ర్ నిర్మాత కేఎల్ నారాయణ నిర్మించ‌నున్నారు. ఈ చిత్రానికి రాజ‌మౌళి తండ్రి, ఇండియ‌న్ స్టార్ రైట‌ర్ విజ‌యేంద్ర ప్ర‌సాద్ క‌థ అందిస్తున్నారు.

- Advertisement -

ఇక ఈ సినిమాను ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి..ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. అంతేకాదు, మ‌హేష్‌ను జ‌క్క‌న్న ఎలా చూపించ‌నున్నాడు, వీరి సినిమా ఏ బ్యాక్ డ్రాప్‌లో తెర‌కెక్క‌నుంది.. ఇలా ఎన్నో ప్ర‌శ్న‌లు తెర‌పైకి వ‌చ్చాయి. అయితే తాజాగా ఓ బాలీవుడ్ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న ర‌చ‌యిత విజ‌యేంద్ర ప్ర‌సాద్‌.. మ‌హేష్‌-రాజ‌మౌళి సినిమా బ్యాక్‌డ్రాప్‌ను లీక్ చేసేశారు.

ఆయన మాట్లాడుతూ.. మ‌హేష్ కోసం ఓ జంగిల్ బేస్డ్ అడ్వెంచ‌ర్ స్టోరీ రెడీ చేస్తున్నామ‌ని..ఆఫ్రిక‌న్ ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ ఎంటర్టైనర్ గా సినిమా ఉంటుంద‌ని హింట్ ఇచ్చారు. అయితే ప్ర‌స్తుతం క‌థ‌పై చ‌ర్చ‌లు న‌డుస్తున్నాడ‌ని..మ‌రియు కొంత రిసెర్చ్ కూడా చేయాల‌ని విజ‌యేంద్ర ప్ర‌సాద్ చెప్పుకొచ్చారు. కాగా, ఆర్ఆర్ఆర్ త‌ర్వాత జ‌క్క‌న మ‌హేష్ సినిమాపై దృష్టి సారించ‌డ‌నున్నారు.

Share post:

Popular