నెట్ ఫ్లిక్స్ న్యూ ఫీచర్ మీ కోసం..!

ఈ రోజుల్లో నెట్ ఫ్లిక్స్ అంటే తెలియని వారు ఉండరు. వినోదాత్మక రంగంలో తమకు సాటిలేదు అని ప్రూవ్ చేసుకున్న ఈ సంస్థ..ఈ సారి మరో రకంగా జనాలను కట్టిపడేసే ప్రయత్నం చేస్తుంది. ఆన్లైన్ గేమింగ్ అనే ఫీచర్ తో మన ముందుకు రాబోతుంది. చిన్నారులు, యువత ఇటీవల కాలంలో ఇళ్లకు పరిమితమై ఆన్ లైన్ గేమింగ్ పై ఎక్కవ మక్కువ చూపిస్తున్నారు. ఈ పాయింట్ క్యాచ్ చేసిన నెట్ ఫ్లిక్స్ సంస్థ మొబైల్ వర్షన్ లో గేమ్స్ అడుకునే విధంగా ఈ కొత్త ఫీచర్ ప్లాన్ చేసింది.

 

2012 నుండి 2021వరకు స్టాటిస్టా మార్కెట్ ఎనాలసిస్ ప్రకారం 52.8 శాతం నుండి 138.4 శాతానికి వీడియో గేమ్స్ వినియోదారుల సంఖ్య పెరిగినట్లు స్పష్టమౌతుంది. ఈక్రమంలోనే నెట్ ఫ్లిక్స్ గేమింగ్ వ్యవస్ధపై కన్నేసింది. ఇందుకోసం గేమ్ డెవలప్ మెంట్ వైస్ ప్రెసిడెంట్ గా ఫేస్ బుక్ ఎగ్జిక్యూటివ్ మైక్ వెర్దును నెట్ ఫ్లిక్స్ నియమించుకుంది. వచ్చే ఏడాది చివరి కల్లా కిడ్స్ రీ క్యాప్ ఈమెల్, కిడ్స్ టాప్ 10 రో పేరుతో సిరీస్ ను విడుదల చేయనున్నట్లు వైస్ ప్రెసిడెంట్ గా నియమితులైన మైక్ వెర్దు తెలిపారు.