ఇన్స్ అఫీషియల్:అమెజాన్ ప్రైమ్‌లో `నార‌ప్ప‌`..రిలీజ్ డేట్ ఇదే!

విక్ట‌రీ వెంక‌టేష్, ప్రియ‌మ‌ణి జంట‌గా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెర‌కెక్కిన తాజా చిత్రం నార‌ప్ప‌. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, వి. క్రియేషన్స్ బ్యాన‌ర్ల‌పై కలైపులి ఎస్.తను, దగ్గుబాటి సురేష్‌బాబు సంయుక్తంగా నిర్మించారు. త‌మిళంలో హిట్ అయిన అసుర‌న్‌కు ఇది రీమేక్‌.

షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే.. గ‌త కొద్ది రోజులుగా ఈ చిత్రం ఓటీటీలో విడుద‌ల కాబోతోందంటూ జోరుగా ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఆ ప్ర‌చార‌మే నిజ‌మైంది.

ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ఈ చిత్రం జూలై 20వ తేదీన రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లుగా చిత్రయూనిట్‌ ప్రకటించింది. అటు అమెజాన్ ప్రైమ్ కూడా ఈ విష‌యాన్ని అఫీషియ‌ల్ చేసింది. దాంతో ఓటీటీ ఈ సినిమాను చూసేందుకు నెటిజ‌న్లు ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు.

Image