`నార‌ప్ప‌` నుంచి న్యూ అప్డేట్‌..వెంకీ ఫ్యాన్స్‌కు సూప‌ర్ ట్రీట్ రెడీ!

విక్ట‌రీ వెంక‌టేష్‌, శ్రీకాంత్ అడ్డాల కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం నార‌ప్ప‌. ఈ చిత్రంలో వెంకీకి జోడీగా ప్రియ‌మ‌ణి న‌టించ‌గా..కార్తీక్ రత్నం, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ, సంపత్ రాజ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషించారు. త‌మిళంలో హిట్ అయిన అసురన్ చిత్రానికి ఇది రీమేక్‌.

ఇప్ప‌టికే షూటింగ్‌తో పాటు సెన్సార్ కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే.. వెంకీ ఫ్యాన్స్‌కు సూప‌ర్ ట్రీట్ రెడీ చేశారు నార‌ప్ప మెక‌ర్స్‌. ఇంత‌కీ విష‌యం ఏంటంటే..ఈ చిత్రంలోని `చలాకి చిన్నమ్మీ..` అనే ఫస్ట్ లిరికల్ సాంగ్‌ను జూలై 11 ఉదయం 10గంటలకు విడుదల చేయబోతున్నట్లుగా తెలుపుతూ చిత్రయూనిట్‌ ఓ పోస్టర్‌ని విడుదల చేసింది.

దాంతో వెంకీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా, ఈ సినిమా ఓటీటీ లో విడుద‌ల కానుందంటూ గ‌త కొద్ది రోజులుగా ఓ వార్త నెట్టింట వైర‌ల్‌గా మారిన సంగ‌తి తెలిసిందే. కానీ, ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌ను చూస్తేంటే.. నార‌ప్ప ఖ‌చ్చితంగా థియేటర్‌లో వ‌చ్చేలానే క‌నిపిస్తోంది. మ‌రి దీనిపై స్ప‌ష్ట‌త రావాల్సి ఉంది.

Image

Share post:

Latest