బాలకృష్ణ వ్యాఖ్యలకు నాగబాబు స్పందన ఇదే..!

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో ఈ సారి పోటీ గట్టిగానే ఉంది. టాలీవుడ్ కొని వర్గాలుగా చీలిపోయి వాడీవేడి వాతావరణం నెలకొంది. తాజాగా ‘మా’ ఎన్నికలపై బాలయ్య బాబు చేసిన వ్యాఖ్యలు ‘మా’ సెగకు మరింత డోస్ పెంచాయి. టాలీవుడ్ ప్రముఖులు తెలంగాణ సర్కారుతో సన్నిహితంగా మెలుగుతున్నారు. వారు అడిగితే ప్రభుత్వం ఒక్క ఎకరం ఇవ్వదా? అందులో ‘మా’కు శాశ్వత భవనం నిర్మించవచ్చు కదా అని బాలయ్య ప్రశ్నించారు. ‘మా’ కోసం శాశ్వత భవనం అజెండాతో ముందుకు వచ్చిన మంచు విష్ణుకు మద్దతు ఇస్తున్నానని తెలిపారు.

 

తాజాగా నాగబాబు దీనిపై స్పందించారు. ‘మా’కు గతంలో అధ్యక్షుడిగా పోటీ చేసిన మురళీమోహన్ పోరాటం చేసి ఉంటే ఎప్పుడో శాశ్వత భవనం సాకారమయ్యేదని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు భవనం విషయం పై ముందుకు వచ్చిన మంచు విష్ణుకు స్థలంపై ఏం స్పష్టత ఉందని నాగబాబు ప్రశ్నించారు. అన్ని అంశాల్లో స్పష్టత ఉన్న ప్రకాశ్ రాజ్ కు తాము మద్దతిస్తున్నామని మెగా బ్రదర్ వెల్లడించాడు.