శిల్పా శెట్టి భ‌ర్త రాజ్ కుంద్రాకు బిగ్ షాకిచ్చిన కోర్డు!

అశ్లీల చిత్రాల కేసులో బాలీవుడ్ తార శిల్పా శెట్టి భార్య‌, వ్యాపార‌వేత్త రాజ్ కుంద్రా గ‌త వారం అరెస్ట్ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ కేసును సీరియ‌స్‌గా తీసుకున్న ముంబై పోలీసులు అన్ని కోణాల్లోనూ విచార‌ణ చేస్తుండ‌డంతో.. రోజుకో కొత్త‌ విష‌యం బ‌య‌ట‌ప‌డుతోంది. దాంతో రాజ్‌ కుంద్రా చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది.

ఇక తాజాగా కుంద్రాకు మ‌రో బిగ్ షాక్ త‌గిలింది. రాజ్ కుంద్రా పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను ముంబైలోని కోర్టు ఈ రోజు కొట్టివేసింది. ఈ కేసులో ఇంకా దర్యాప్తు జరుగుతోందని, కుంద్రాకు బెయిల్ మంజూరు చేయరాదని, చేసిన పక్షంలో సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని ఇన్వెస్టిగేటింగ్ అధికారి కిరణ్ బిద్వే కోర్టుకు తేలిపారు.

ఈ వాదనను ఏకీభవించిన‌ కోర్టు.. కుంద్రా బెయిల్‌ను తిరస్కరించింది. ఆయనతో పాటు ఆయన సహచరుడు ర్యాన్ థోర్పే బెయిల్ పిటిషన్ ను కూడా నిరాకరించింది. ఇక రాజ్ కుంద్రా కస్టడీని నిన్ననే మరో రెండు వారాల పాటు కోర్టు పొడిగించింది.