టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ శాఖా మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు తెలంగాణ రాష్ట్రంలో ఫుల్ ఫాలోయింగ్ ఉంది. ఆయన ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ సాయం కోరిన వారిని, ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటాడు. కరోనా టైంలో కూడా ఎంతోమందికి సహాయం అందించాడు. నేడు మంత్రి కేటీఆర్ 45వ పుట్టినరోజు సందర్భంగా బాలీవుడు నటుడు సోనూసూద్ మంత్రికి ట్విట్టర్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
‘ఈ ఏడాది రాబోయే రోజుల్లోనూ మీకు అంతా మంచే జరగాలి.. మీ విజన్ మిలియన్ల మందికి మార్గదర్శకమని తెలిపారు. ‘కేటీఆర్.. మీరొక సూపర్‌స్టార్’. నాకే కాదు.. మొత్తం తెలంగాణకే మీరొక బార్న్ సూపర్‌స్టార్.. మీ ఆప్యాయ కౌగిలింత కోసం ఎంతో ఆత్రుతగా ఎదిరిచూస్తున్న’ అంటూ ట్వీట్ చేశాడు. రియల్ హీరో సోనూసూద్ చేసిన ట్వీట్ కు స్పందిస్తూ మంత్రి కేటీఆర్ వెంటనే రిప్లై ఇచ్చాడు. థ్యాంక్స్ సోను భాయ్ అంటూ ఆప్యాయంగా బదులిచ్చాడు.
Very kind words…Many thanks Sonu bhai ? https://t.co/XeqyCgNe0Q
— KTR (@KTRTRS) July 24, 2021