అతనే నా క్రష్ అని అంటున్న మెహ్రీన్…?

ఈ మధ్య కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్న హీరోయిన్ గా మెహ్రిన్ నిలిచింది. ఆమె తన ప్రియుడు భవ్య బిష్ణోయ్ తో ప్రేమలో పడటం దగ్గర నుంచి నీటిలో ప్రపోజ్ చేసుకోవడం, సముద్ర తీరంలో సేద తీరడం, సోషల్ మీడియాలో తమ ఫోటోలను పంచుకోవడం, వేడుకగా ఎంగేజ్ మెంట్ చేసుకోవడం, చివరికి ఆ ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ అని ప్రకటించడం అన్నీ జరిగిపోయాయి. అతి తక్కువ కాలంలోనే ఆమె ఈ విషయాల్నీ సోషల్ మీడియా వేదికపై పంచుకుంది. ఇదిలా ఉంటే ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతోంది.

తన కుటుంబంలో ఐఏఎస్ అధికారి ఉండటం వల్ల తన తండ్రి కూడా తనను ఐఏఎస్ ఆఫీసర్ చేయాలనుకునేవాడని చెప్పుకొచ్చారు. కెనాడా అందాల పోటీలో పాల్గొని మిస్ పర్సనాలిటిగా గుర్తింపు తెచ్చుకున్నట్లుగా చెప్పుకొచ్చారు. తనకు హీరోల్లో సల్మాన్ ఖాన్ అంటే చాలా ఇష్టమని, అయితే తన కంటే పెద్దవాడని తెలిసి బాధపడినట్లు తెలిపారు. సినిమాల్లోకి రాకముందు నుంచి అనుష్క శెట్టి అంటే చాలా ఇష్టమని బాహుబలిలో దేవసేన పాత్రకు ఫిదా అయిపోయినట్లు వివరించారు.

Share post:

Popular