లేటు వ‌య‌సులో మంచు ల‌క్ష్మి ఘాటు అందాలు..పిక్స్ వైర‌ల్‌!

సీనియ‌ర్ న‌టుడు మోహ‌న్ బాబు కుమార్తె, న‌టి, నిర్మాత మంచు ల‌క్ష్మి గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మొద‌ట ప‌లు ఇంగ్లీష్ సినిమాల్లో న‌టించిన మంచు ల‌క్ష్మి.. అనగనగా ఓ ధీరుడు సినిమాతో టాలీవుడ్‌కు ప‌రిచ‌య‌మైంది. తొలి సినిమాతోనే త‌న‌లోని విల‌నిజం చూపించి ఉత్త‌మ విల‌న్‌గా అవార్డును అందుకుంది.

ఆ త‌ర్వాత ప‌లు చిత్రాల్లో న‌టించినా.. మంచి ల‌క్ష్మికి భారీ హిట్టు మాత్రం ప‌డ‌లేదు. కానీ, ప‌లు టీవీ షోల‌కు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించి.. మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ. ఇదిలా ఉంటే.. సోష‌ల్ య‌మా యాక్టివ్‌గా ఉండే మంచు ల‌క్ష్మి.. ఎప్పుడూ ఏదో ఒక పోస్ట్‌తో వార్త‌ల్లో నిలుస్తుంటుంది.

అయితే తాజాగా ఈ అమ్మ‌డు కుర‌చ దుస్తులు ధ‌రించి ఫొటోల‌కు పోజులిచ్చింది. ప్ర‌స్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైర‌ల్‌గా మారాయి. నాలుగు ప‌దుల వ‌య‌సులోనూ మంచు ల‌క్ష్మి సూప‌ర్ హాట్ గా ఈ ఫొటోల్లో క‌నిపిస్తుండ‌డంతో.. నెటిజ‌న్లు ర‌క‌ర‌కాల కామెంట్లు చేస్తున్నారు.

https://www.instagram.com/p/CREkGuIHVPU/?utm_source=ig_web_copy_link