టీడీపీకి ఎల్ రమణ రాజీనామా..?

తాజాగా తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ పార్టీకి రాజీనామా చేస్తూ, తన రాజీనామా లేఖను టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు అందచేశారు. అయితే తన రాజీనామా లేఖలో కేవలం మూడు వాఖ్యాలతో లేఖను ముగించారు. 30 సంవత్సరాలుగా తోడ్పాటు అందించిన చంద్రబాబుకు తన ధన్యవాదాలు అని ఎల్. రమణ తెలిపారు. ఇది ఇలా ఉండగా మరో వైపు టీఆర్‌ఎస్‌ పార్టీలోకి మారబోతున్నట్లు రమణ అధికారికంగా తెలిపారు. ఇలా పార్టీ మారడానికి గల కారణం విషయానికి వస్తే తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో మరింత చేరువగా.. రాష్ట్ర ప్రగతిలో భాగస్వామ్యం కావాలనే భావనతో టీఆర్ఎస్ పార్టీలోకి చేంజ్ అవుతున్నట్లు పేర్కొన్నారు.

ఇక మరోవైపు టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుతో ఎల్‌ రమణ భేటీ అయిన సంగతి అందరికి తెలిసిందే. గడిచిన గత రెండు సంవత్సరాలుగా స్వరాష్ట్రంలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సీఎం కేసీఆర్‌తో సుదీర్ఘంగా మాట్లాడినట్లు తెలుస్తుంది. మరి టీఆర్‌ఎస్‌ పార్టీలో రమణ ఎప్పుడు చేరతారు అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

Share post:

Latest