ఆ సీరియ‌ల్స్‌ కోసం కృతి శెట్టి అంత పుచ్చుకుంటుందా?

`ఉప్పెన‌` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన అందాల భామ కృతి శెట్టి.. మొద‌టి సినిమాతోనే భారీ హిట్ అందుకుని సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది. ప్ర‌స్తుతం ఈ భామ నాని స‌ర‌స‌న శ్యామ్ సింగ‌రాయ్‌, సుధీర్‌ బాబు స‌ర‌స‌న ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మ‌రియు రామ్ స‌ర‌సన ఓ చిత్రంలో న‌టిస్తోంది.

- Advertisement -

వీటితో పాటుగా మ‌రిన్ని అవ‌కాశాలు కూడా కృతి త‌ల‌పు త‌డుతున్నాయి. అయితే అవ‌కాశాలు పెర‌గ‌డంతో.. ఈ భామ రెమ్యున‌రేష‌న్ కూడా పెంచేస్తోంది. ఇదిలా ఉంటే.. తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్‌ జీ తెలుగు వారు కృతి శెట్టితో ఓ డీల్ కుదుర్చుకున్నార‌ట‌.

ఇంత‌కీ ఆ డీల్ ఏంటంటే.. త‌మ ఛాన‌ల్‌లో ప్ర‌సారం కాబోయే సీరియ‌ల్స్‌ను ప్ర‌మోట్ చేయాల‌ని జీ తెలుగు వారు.. కృతి శెట్టిని సంప్ర‌దించార‌ట‌. అయితే అందుకు కృతి కోటి రూపాయల వరకు పారితోషికం అడిగింద‌ట‌. ఇక ఆమె క్రేజ్ దృష్ట్యా వారు కూడా కోటి ఇవ్వ‌డానికి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది.

Share post:

Popular