కొరటాల, తారక్ ప్రాజెక్ట్ పై న్యూ అప్డేట్…!

టాలీవుడ్ మోస్ట్ అవేయిటెడ్ మూవీ RRR. ఎన్టీఆర్, రామ్ చరణ్, జక్కన్న లాంటి స్టార్లు ఈ సినిమా విజయవంతమవడానికి రేయింబవళ్లు… కష్టపడుతున్నారు. ఈ మూవీ పూర్తయిన వెంటనే ఎన్టీఆర్ కోసం మరో బిగ్ ప్రాజెక్ట్ వేయిట్ చేస్తుందని టాక్. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబినేషన్లో ఓ సినిమా ప్రకటించారు. కానీ ప్రస్తుతం ఎన్టీఆర్ RRR షూటింగ్ అయిన వెంటనే తనకు జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన కొరటాల శివతో మూవీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నాడట. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో పాన్ ఇండియా మూవీ తెరకెక్కనుందని సమాచారం.

ఇదిలా ఉండగా… ఈ మూవీకి సంబంధించి ఇప్పుడు ఓ ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో ఓ స్ట్రాంగ్ క్యారెక్టర్ కోసం ప్రముఖ బాలీవుడ్ స్టార్ ని ఎంపిక చేశారట. మరి అతడు ఎవరో తెలియాలంటే అఫీషియల్ ప్రకటన వచ్చేంత వరకు వేయిట్ చేయాల్సిందే.