వామ్మో..మేక‌ప్ లేకుంటే నాగార్జున‌ ఇలా ఉంటారా..!?

తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అగ్రనటుడిగా, న‌వ‌మన్మధుడిగా పేరుగాంచిన కింగ్ నాగార్జున గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. వయసు ఛాయలు ఏ మాత్రం కన్పించని హీరోల్లో ఈయ‌న ముందు వ‌ర‌స‌లో ఉంటారు అన‌డంలో సందేహ‌మే లేదు.

ఎందుకంటే, ఆరు ప‌దుల వ‌య‌సులోనూ ఎవర్ గ్రీన్‌గానే క‌నిపిస్తూ.. వ‌రుస‌ సినిమాల‌తో దూసుకుపోతున్నారు. అయితే ఇలాంటి త‌రుణంలో నాగ్ లేటెస్ట్ ఫొటో ఒకటి సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ ఫొటోలో నాగ్ పూర్తిగా నెరిసిన జుట్టు, మీసకట్టుతో కనిపిస్తున్నారు.

ఇక ఈ ఫొటో చూసిన నెటిజ‌న్లు మ‌రియు అభిమానులు ఆశ్చ‌ర్య పోవ‌డ‌మే కాదు.. మేక‌ప్ లేకుంటే నాగ్ ఇలా ఉంటారా అంటూ సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు. మొత్తానికి నాగ్ లుక్ మాత్రం నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. కాగా, ప్ర‌స్తుతం నాగార్జున కళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో బంగార్రాజు, ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో ఓ సినిమాలో న‌టిస్తున్నాడు.

Nagarjuna Old and Grey Haired Look Goes All Over The Internet

Share post:

Popular