కాజ‌ల్ డేరింగ్ స్టెప్‌..పెళ్లి త‌ర్వాత అలాంటి పాత్ర చేస్తుంద‌ట‌?!వ‌

కాజ‌ల్ అగ‌ర్వాల్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుడు పెట్టిన కాజ‌ల్.. ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగింది. కెరీర్ మొదలై 16 ఏళ్లైనా ఈ అమ్మ‌డు జోరు ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు.

ఇక పెళ్లి త‌ర్వాత కూడా వ‌రుస ఆఫ‌ర్ల‌తో దూసుకుపోతున్న ఈ భామ‌.. ప్రయోగాలు చేసేందుకు కూడా సై అంటుంది. ఈ నేప‌థ్యంలోనే తాజాగా ఓ తమిళ చిత్రంలో తల్లి పాత్రలో పోషించేందుకు కాజ‌ల్ ఒకే చెప్పింద‌ట‌. పైగా అది డీ గ్లామ‌ర్ పాత్ర‌ని తెలుస్తోంది.

ఇప్పటిదాకా గ్లామర్ పాత్రలు మాత్ర‌మే చేస్తూ మెప్పించిన‌ కాజ‌ల్‌.. ఇప్పుడు డీగ్లామ‌ర్ పాత్ర పోషించేందుకు సిద్ధ‌మ‌వ‌డం డేరింగ్ స్టెప్ అనే చెప్పాలి. కాగా. హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కే ఈ చిత్రానికి రౌడీ బేబీ అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. శ‌రవణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ నటి రమ్యకృష్ణ కీలక పాత్రలో నటించనున్నారు.

Share post:

Latest