ఆక‌ట్టుకుంటున్న తేజ స‌జ్జ‌ `ఇష్క్‌` ట్రైల‌ర్‌!

టాలీవుడ్ యంగ్ హీరో తేజ స‌జ్జ తాజా చిత్రం `ఇష్క్‌`. నాట్ ఏ లవ్ స్టోరీ అనేది ట్యాగ్ లైన్‌. య‌స్‌.య‌స్‌. రాజుని ద‌ర్శ‌కుడిగా ప‌రిచయం చేస్తూ దక్షినాదిలోని సుప్ర‌సిద్ద నిర్మాణ ‌సంస్థ‌ల్లో ఒక‌టైన మెగా సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్ నిర్మిస్తోన్న చిత్రమిది. ఇందులో ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఎప్పుడో విడుద‌ల కావాల్సి ఉన్నా.. క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. అయితే ప్ర‌స్తుతం ప‌రిస్థితిలు అదుపులోకి రావ‌డంతో.. ఇష్క్‌ను జూలై 30న థియేట‌ర్ల‌లో విడుద‌ల చేయ‌బోతున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఇష్క్ ట్రైల‌ర్‌ను చిత్ర యూనిట్ తాజాగా విడుద‌ల చేసింది. `నా పేరు సిద్ధు` అని తేజ సజ్జ పరిచయం చేసుకుంటూ ఓ ఇంట్లోకి వెళ్లడంతో ప్రారంభ‌మైన ఈ ట్రైల‌ర్ ఆధ్యంతం సూప‌ర్ థ్రిల్లింగ్‌గా కొన‌సాగింది.

హీరోయిన్ తో ప్రేమలో ఉన్న తేజ.. ఆమె బర్త్ డే ప్లాన్స్ లో భాగంగా కారులో వెళ్తుండగా.. ఏదో ఊహించని ఘటన జరిగినట్లు ట్రైల‌ర్ బ‌ట్టీ అర్థం అవుతోంది. అసలు వీరి కారు ప్రయాణంలో ఏం జరిగింది? వీరిపై ఎవరు, ఎందుకు దాడి చేశారు? అన్న అంశాలు ఆస‌క్తి రేకిస్తున్నాయి. మొత్తానికి ఆక‌ట్టుకుంటున్న ఈ ట్రైల‌ర్‌.. సినిమాపై మంచి అంచ‌నాల‌ను క్రియేట్ చేసింది. మ‌రి సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే.. జూలై 30 వ‌రకు వెయిట్ చేయాల్సిందే.

Share post:

Latest