పొలిటిక‌ల్ ఎంట్రీపై కేటీఆర్ తనయుడు షాకింగ్ కామెంట్స్‌!

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌న‌వ‌డు, మంత్రి కేటీఆర్ త‌న‌యుడు హిమాన్షు రావు గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. చిన్న వయసులోనే సమాజానికి సేవ చేస్తున్న హిమాన్షు.. ఈ మ‌ధ్యే ప్రతిష్ఠాత్మక డయానా అవార్డును కూడా అందుకున్నాడు.

ఇదిలా ఉంటే..తాత కేసీఆర్, తండ్రి కేటీఆర్ వార‌స‌త్వాన్ని అందిపుచ్చుకుని.. మూడో తరంగా హిమన్షురావు రాజకీయాల్లోకి వ‌స్తాడ‌ని, వారిలానే చ‌క్రం తిప్పుతాడ‌ని ఎప్ప‌టి నుంచో వ‌ర్త‌లు వ‌స్తున్నాయి. అయితే ఈ వార్త‌ల‌పై తాజా హిమాన్షు సోష‌ల్ మీడియా వేదిక‌గా షాకింగ్ కామెంట్స్ చేశాడు.

రాజకీయాలంటే తనకు ఏమాత్రం ఆసక్తి లేద‌ని, తాను భవిష్యత్‌లో ఎప్పుడు కూడా రాజకీయాల్లోకి రానని తెగేసి చెప్పాడు. ప్ర‌స్తుతం తనకంటూ ప్రత్యేక లక్ష్యాలు, క‌ల‌లు ఉన్నాయని, వాటిని చేరుకోవడమే తన ధ్యేయమని హిమాన్షు స్ప‌ష్టం చేశాడు. మ‌రి ఇప్ప‌టికైనా హిమాన్షు పొలిటిక‌ల్ ఎంట్రీపై వ‌స్తున్న వార్త‌ల‌కు బ్రేక్ ప‌డుతుందో లేదో చూడాలి.

Share post:

Latest