ఫ్రెండ్‌షిప్ డే.. `ఆర్ఆర్ఆర్‌` నుంచి మ‌రో అదిరిపోయే ట్రీట్‌!?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న భారీ మ‌ల్టీస్టార‌ర్ ఆర్ఆర్ఆర్. డీవీవీ దానయ్య నిర అలియా భట్‌, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉన్న ఈ పాన్ ఇండియా చిత్రం అక్టోబ‌రు 13న గ్రాండ్ రిలీజ్ కానుంది.

దాంతో ఇప్ప‌టి నుంచే ప్ర‌మోష‌న్స్ షురూ చేసింది చిత్ర యూనిట్‌. ఈ నేప‌థ్యంలోనే ఆర్ఆర్ఆర్‌ నుంచి ఒక సాలిడ్ మేకింగ్ వీడియో కట్ ను జూలై 15న ఉద‌యం 11గంట‌ల‌కు రిలీజ్ చేయనున్నామని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ సినిమా నుంచి మ‌రో ట్రీట్ కూడా రాబోతోంద‌ట‌.

ఆగ‌స్టు 1న అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం అన్న సంగ‌తి తెలిసిందే. అయితే ఫ్రెండ్‌షిడ్ డే సందర్భంగా ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ మధ్య స్నేహం ప్రతిబింబించేలా ఆర్ఆర్ఆర్ నుంచి మ‌రో వీడియోను విడుదల చేసేందుకు మేక‌ర్స్‌ సన్నాహాలు చేస్తున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఇదే నిజ‌మైతే.. ఇటు మెగా ఫ్యాన్స్‌, అటు నంద‌మూరి ఫ్యాన్స్ పండ‌గ చేసుకుంటారు.

Share post:

Popular